క్రైమ్/లీగల్

సమాధి అయిన ‘కూలి’ బతుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, సెప్టెంబర్ 3: ఓ పురాతన భవనం వారి పాలిట మృత్యుశాపంగా మారింది. కూలి కోసం వచ్చిన కార్మికులు అదే గోడ కిందపడి అశువులు బాసిన విషాద సంఘటనతో మండలం ఉలిక్కిపడింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు భవన శిథిలాల కిందే సమాధి కాగా, మరో ఇద్దరు నెత్తురోడుతూ ఆసుపత్రుల పాలుకావాల్సి వచ్చింది. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని ఇనిమెట్ల గ్రామంలో బండికల్లు నాగేశ్వరరావుకు చెందిన పురాతన భవనాన్ని కూల్చేందుకు ఇంటి యాజమానితో కార్మికులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం వారు కూలిపనులకు హాజరై కూల్చివేత పనులు ప్రారంభించారు. ఇంతలో ఒక గోడ హఠాత్తుగా కూలి కార్మికులపై పడింది. దీంతో లింగాల డానియేలు (40), ప్రత్తిపాటి వెంకటరావు (40) అక్కడికక్కడే మృతిచెందగా, లింగాల ఆశీర్వాదం, లింగాల యోహాను, కడియాల వెంకటేశ్వర్లు, లింగాల శ్రీనివాసరావులకు తీవ్రగాయాలయ్యాయి. నలుగురు క్షతగాత్రులను హుటాహుటిన నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే డానియేలు, వెంకటరావు మృతదేహాలను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజుపాలెం ఎస్‌ఐ వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తారని భావించిన కార్మికుల కుటుంబాల్లో మృత్యువార్త పెను విషాదం నింపింది.