క్రైమ్/లీగల్

గల్ఫ్ బాధితుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 3: చేసిన అప్పులు తీర్చలేక పోతున్నానంటూ ఓ గల్ఫ్ బాధితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసిం ది. సోమవారం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌రావుపల్లెలో చెదురుమల్ల దేవయ్య (40) ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళగా ఇటీవలే దుబాయి దేశం వెళ్లి వచ్చిన దేవయ్యకు పని సరిగా లభ్యం కాకు ఇంటికి తిరిగి వచ్చాడు. అయిదు సంవత్సరాల క్రితం అప్పు చేసి సౌదీ దేశం వెళ్ళాడు. పని బాగానే ఉందని, డబ్బులు బాగా వస్తున్నాయని బావించిన దేవయ్య స్వగ్రామానికి వచ్చి అప్పులతో ఇల్లు నిర్మించుకున్నాడు. తనకు ఉన్న ఎకరం వ్యవసాయ పొలంలో ఇల్లు సరిగా లేక పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగాయి. ఎలాగైనా అప్పు తీర్చాలని మళ్ళీ సౌదీ వెళ్ళాడు. అయితే అక్కడి ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన వలస బాధితులను వెనక్కు పంపడంతో ఆయన తిరిగి వచ్చాడు. అటు పని లేక, ఇటు చేసిన అప్పులు పెరగడంతో మనస్థాపానికి గురై దేవయ్య సోమవారం తెల్లవారు సమయంలో ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.