క్రైమ్/లీగల్

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, సెప్టెంబర్ 10: ఆశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం పుణ్యమాంటూ గిరిజన బాలిక నిండునూరేళ్లు జీవితం తెల్లారిపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక పట్ల ఆశ్రమ ఉపాధ్యాయులు చూపించిన నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని బందవీధి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలకల పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. ఆశ్రమ ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యంతో బాలిక మృతి చెందడంతో ఏజెన్సీలో సర్వత్రా అందోళన వ్యక్తవౌతుండడమే కాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి, గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం బందవీధి ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కిముడు గౌతమి (11) అనే గిరిజన బాలిక గత రెండు రోజులుగా తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యింది. అతిసార వ్యాధితో బాధపడుతున్న ఈ బాలికను ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించాల్సిన ఆశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు, మెట్రిన్ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసినట్టు చెబుతున్నారు. తమ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న గౌతమి తల్లిదండ్రులు రామరాజు, కొండమ్మ ఆదివారం ఆశ్రమ పాఠశాలకు వచ్చి తమ కుమార్తెను తమకు అప్పగిస్తే వైద్యం చేయించుకుంటామని కోరారు. ఆశ్రమం నుంచి బాలికను పంపించకూడదని, తామే వైద్యం చేయిస్తామని ప్రదానోపాధ్యాయుడు తల్లిదండ్రులతో చెప్పడంతో వారు తమ గ్రామానికి వెళ్లిపోయారు. అయితే తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఈ బాలికను ప్రదానోపాధ్యాయుడు, మెట్రిన్ ఆసుపత్రికి తరలించకుండా ఆశ్రమంలోనే ఉంచివేయడంతో సోమవారం ఉదయానికి ఈ బాలిక పరిస్థితి విషమించింది. దీంతో గౌతమిని సోమవారం ఉదయం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. అతిసారంతో తీవ్ర అస్వస్థతకు లోనైన బాలికను సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడం వలనే మృతి చెందినట్టు స్పష్టంగా తెలియడంతో పలు గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాలిక మృతికి ఆశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు, మెట్రిన్ నిర్లక్ష్యమే కారణమని, వీరిపై తక్షణమే శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించకుండా ఆశ్రమంలోనే విడిచిపెట్టిన ప్రదానోపాధ్యాయుడు, మెట్రిన్ బాధ్యతారాహిత్యాన్ని వీరంతా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందడంపై ఈ నెల 12వ తేది మంగళవారం నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు గిరిజన సంఘాలన్నీ సమాయత్తవౌతున్నాయి. కాగా బాలిక మృతి పట్ల స్థానిక మండల విద్యాశాఖ అధికారి సోమవారం సాయంత్రం ప్రాధమిక విచారణ నిర్వహించారు. ఇదిలాఉండగా బందవీది ఆశ్రమంలో మరో ఐదుగురు బాలికలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఆశ్రమంలో తొమ్మిదో తరగతి చదువుతున్న పద్మకుమారి, ఐదో తరగతి చదువుతున్న తల్లాబు దేవుడమ్మ, ప్రవలిక, ఏడో తరగతి చదువుతున్న భాగ్య, ఆరో తరగతి చదువుతున్న ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు చెబుతున్నారు.
వినాయక ఉత్సవాలకు పోలీసు అనుమతి తీసుకోవాలి
పాడేరు(రూరల్), సెప్టెంబర్ 10: వినాయక చవితి పర్వదినానికి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసే వారు ముందుగా తమ అనుమతి తీసుకోవాలని పాడేరు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామారావు కోరారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమ అనుమతి లేనిదే పట్టణంలో ఎక్కడా వినాయక ప్రతిమలు ఏర్పాటు చేయరాదని చెప్పారు. వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసే వారు విద్యుత్ తీగలు, పాఠశాలలు దగ్గరలో లేకుండా చూసుకోవాలని, విగ్రహాలు ఆరు అడుగులకు మించి ఉండరాదని ఆయన సూచించారు. వినాయక ఉత్సవాల పేరిట అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేటప్పుడు అశ్లీల నృత్యాలను ప్రదర్శించరాదని, అనుపు సందర్భంలో ఎటువంటి ప్రమాదాలు సంబవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రామారావు కోరారు.