క్రైమ్/లీగల్

భైంసాలో పోలీసుల కార్డెన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, సెప్టెంబర్ 10: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నర్సింహానగర్, రాజీవ్‌నగర్, సాయినగర్‌లలో వేకువజామున నుండే పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కార్డెన్‌సెర్చ్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే సరైన దృవపత్రాలులేని 120 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, అక్రమంగా నిషేదించిన గుట్కాను పట్టుకున్నారు. అలాగే పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ నిర్భంధ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ ఈ తనిఖీలతో నేరాలను తగ్గించవచ్చని, అలాగే గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకోవచ్చని అన్నారు. ఈ విషయంలో స్థానికులు సహకరించాలని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా కాలనీవాసులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వచ్చే పండుగల నేపథ్యంలో అందరూ ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కార్డెన్‌సెర్చ్‌లో జిల్లా ఎస్పీతోపాటు భైంసా డీఎస్పీ రాజేష్‌బల్, ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100 మంది పోలీసులు పాల్గొన్నారు.