క్రైమ్/లీగల్

మిస్టరీ వీడని వివాహిత అదృశ్యం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చంపేశారంటున్న వివాహిత బంధువులు
* ప్రియుడితో పారిపోయిందంటున్న భర్త, అత్తామామలు
* మనస్థాపంతో మృతి చెందిన మామ
* మూడునెలలు గడచినా ముందుకు సాగని పోలీసు విచారణ

--------------------------------
మార్కాపురం టౌన్, అక్టోబర్ 1: మూడునెలల క్రితం పట్టణంలో జరిగిన వివాహిత అదృశ్యం సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయిని హతమార్చి ఆచూకీ లేకుండా చేశారని అదృశ్య యువతి బంధువులు పేర్కొంటుండగా, ప్రియుడితో పారిపోయిందని భర్త, అత్తమామలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఇరువురి ఫిర్యాదుల మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో 10వ వార్డుకు చెందిన షేక్ అబ్దుల్ష్రీద్ ఒంగోలుకు చెందిన సయ్యద్ రుక్సానా దగ్గరి బంధువులు. తల్లిదండ్రులు లేని రుక్సానాకు రషీద్ తండ్రి షెక్షావలి ఇష్టపూర్వకంగా ఎలాంటి కట్నం లేకుండా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసి కోడలిగా ఇంటికి తీసుకువచ్చారు. మూడేళ్లు ఈ దంపతులు అనోన్యంగా ఉన్నారు. కాగా జూలై 10వ తేదీ రాత్రి రుక్సానా తన ఇంటి నుంచి అదృశ్యమైనట్లు భర్త రషీద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రుక్సానా బంధువులు ఒంగోలు నుంచి మార్కాపురం చేరుకొని ఏమి జరిగిందన్న విషయాన్ని రుక్సానా అత్తమామల నుంచి అడిగి తెలుసుకుంటున్న సమయంలో రుక్సానా భర్త రషీద్ మద్యం సేవించి బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించి రుక్సానాను కించపరుస్తూ మాట్లాడాడని బంధువులు పోలీసుస్టేషన్‌లో తెలిపారు.
* అసలేం జరిగింది..
రుక్సానా అదృశ్యానికి రెండురోజుల ముందు రుక్సాన మరిది రహమాన్ తన సెల్‌ఫోన్ చెడిపోయిందని రుక్సానా ఫోన్ తీసుకొని వినియోగిస్తున్నాడు. ఈ సమయంలో వాట్సప్‌ను పరిశీలిస్తుండగా కొందరు యువకులతో రుక్సానా చేసిన చాటింగ్, అసభ్యకర ఫొటోలు బహిర్గతమయ్యాయి. నివ్వెరపోయిన రహమాన్ సంబంధిత విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసి వాట్సాప్ చిత్రాలు చూపించాడు. దీనితో ఆగ్రహించిన అత్తమామలు, భర్త రుక్సానాపై చేయిచేసుకున్నారు. జరిగిన విషయాన్ని ఒంగోలులోని రుక్సానా బంధువులకు సమాచారం అందచేసి తక్షణమే మార్కాపురం రావాలని తెలిపారు. ఈలోపు రుక్సానా నుంచి సెల్‌ఫోన్ లాగేసుకొని బీరువాలో భద్రపరిచారు. రుక్సానా బంధువులు మార్కాపురం చేరడంలో ఆలస్యం చేసి రెండురోజుల తరువాత వచ్చారు. అర్ధరాత్రి సమయంలో బీరువాలోని సెల్‌ఫోన్‌ను తస్కరించి తెల్లవారే సమయానికి ఇంటి నుంచి పరారైందని, ప్రియుడితో పారిపోయి ఉండవచ్చునని భర్త, అత్తమామలు పేర్కొంటున్నారు.
* రుక్సానాను చంపేశారు..
రుక్సానా అదృశ్యానికి భర్త, అత్తమామలే కారణమని, లేనిపోని ఆరోపణలు చేసి తన మనుమరాలిపై నిందలు వేస్తున్నారని రుక్సానా అమ్మమ్మ మాలన్‌బీ అంటున్నారు. రుక్సానా కోసం బంధువులు ఉన్న అన్ని ప్రాంతాల్లో వెతికామని, ఆచూకీ దొరకలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన ఇరువర్గాల పెద్దలతో రుక్సానా అత్తమామల ఇంటి వద్ద పంచాయతీ నిర్వహించి మాలన్‌బీ బంధువులు రుక్సానా అత్తమామలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ నిందించారు. మీపై నమ్మకంతో మీ ఇంటికి కోడలిగా రుక్సానాను పంపామని, రుక్సానా ఎలా అదృశ్యం అవుతుందని నిలదీశారు. నిర్ణీత గడువులోపు రుక్సానాను తనకు చూపించి అప్పగించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్లినట్లు బంధువులు తెలిపారు.
* మనస్థాపంతో మామ మృతి
జరిగిన సంఘటనకు మనస్థాపానికి గురైన మామ షెక్షావలి తీవ్ర మరోవేదనకు గురై సెప్టెంబర్ 16న ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పట్టణంలోని మూడు మసీదులకు ఆయన పెద్దగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ బ్లాక్ లీడర్‌గా, ఆటోనగర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షెక్షావలి అకాలమృతి చెందడం అదృశ్య కేసు ఛేదింపునకు సవాల్‌గా మారింది. రుక్సానా చేసిన తప్పుకు మందలింపుగా చేయి చేసుకున్నప్పుడు తగలరానిచోట తగిలి రుక్సానా మృతి చెందిందా..? రుక్సానా అదృశ్యం వెనుక అత్తమామలు, భర్త ఉన్నారా..? లేక వాట్సప్ ద్వారా చాటింగ్ చేస్తున్న ప్రియుడితో ఆమె పరారైందా..? రుక్సానాను దాచి ఉంచి బంధువులు డ్రామా ఆడుతున్నారా..? షెక్షావలి అకాలమృతికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు జవాబులేకుండా మిగిలాయి.
* ఎస్సై కోటయ్య వివరణ
వివాహిత రుక్సానా అదృశ్యం కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నామని, ఇరువర్గాల ఆరోపణలు దృష్టికి తీసుకొని పోలీసు తరహాలో ఆచూకీ కోసం గాలిస్తున్నామని పట్టణ ఎస్సై జి కోటయ్య వివరణ ఇచ్చారు. రుక్సానా చరవాణిలో పదిమంది బాయ్‌ఫ్రెండ్స్‌ల ఫోన్ నెంబర్లను సేకరించి ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.