క్రైమ్/లీగల్

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, అక్టోబర్ 25; అనుమతి లేకుండా ఇసుకను తరసలిస్తున్న రెండు లారీలను కులకచర్ల పోలీసులు పట్టుకున్నారు. పాలమూరు జిల్లా కోయిల్‌సాగర్ నుంచి షాద్‌నగర్‌కు తరలిస్తున్న రెండు లారీలను గురువారం పట్టుకుని కేసు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరిమీద కేసులు నమోదు చేసింది వెల్లడించలేదు.

మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య

నేరేడ్‌మెట్, అక్టోబర్ 25: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్థాపానికి గురైన భర్త ఒంటి పై డీజీల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం... గౌతంనగర్‌లో నివసించే విన్‌సెంట్ మారియో(35) క్యాబ్ డ్రైవర్ 2016లో సఫిల్‌గూడలో నివసించే కెలినా మారియే జార్జీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. విరి పెళ్లి కెలినా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో అమెను తిరిగి ఇంటి తీసుకువెళ్లి పోయినట్టు పోలీసులు తెలిపారు. 21వ తేదిన వినె్సంట్ అత్తగారి ఇంటి వద్దకు వెళ్లి భార్యను తనతో రావాలని కొరగా అమె నిరాకరించడంతో మనస్థాపానికి గురైన అతడు తన వెంట తెచ్చుకున్న డీజీల్ ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

గృహిణి అదృశ్యం

నేరేడ్‌మెట్, అక్టోబర్ 25: ఇంట్లో చెప్పకుండా వెళ్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ శివనగర్ కాలనీలో నివసించే బీ.ప్రమీల(55) గృహిణి. ఈనెల 22వ తేదిన ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి ఇప్పటి వరకు తిరిగిరాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.