క్రైమ్/లీగల్

రూ. 24 లక్షల విలువైన బంగారు ముద్దలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 29: బంగారు నగలు తయారుచేసే ద్రావకం షాపుల్లో పనిచేస్తూ యజమానుల కళ్లుగప్పి వారి బంగారు నగలను ముద్దలుగా మార్చి దానిని కాజేయడానికి ప్రయత్నించిన ఇద్దరు సోదరులను కాకినాడ క్రైమ్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. మహారాష్ట్ర సాంగ్లి జిల్లా, విఠ మండలం, కార్వి గ్రామానికి చెందిన ప్రశాంత్ జాదవ్ (19), సుశాంత్ జాదవ్ (23) అనే సోదరులు ఇద్దరు బంగారు నగలు తయారుచేసే ద్రావకం షాపుల్లో పనిచేస్తుంటారు. ప్రశాంత్ జాదవ్ పెదనాన్న కుమారుడు సతీష్ జాదవ్‌కు కాకినాడ గోల్డ్ మార్కెట్‌లో ద్రావకం షాపు ఉంది. ఈ షాపులో ప్రశాంత్ జాదవ్ సుమారు ఏడు సంవత్సరాలుగా కార్మికుడుగా పనిచేసి ఎనిమిది నెలల క్రితం పని మానివేసి తన స్వగ్రామం కార్వి గ్రామానికి తిరిగి వెళిపోయాడు. అయితే గత నెలలో తిరిగి కాకినాడ వచ్చి అదే షాపులో పనికి చేరాడు. షాపులో కొన్ని రోజులు పనిచేసిన తరువాత గొడవ పడి వినాయక చవితిరోజున అతను తన స్వగ్రామానికి తిరిగి వెళిపోయాడు. షాపులో పనిచేస్తున్న సమయంలోప్రశాంత్ జాదవ్ షాపునకు చెందిన రెండవ తాళాన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. ప్రశాంత్ జాదవ్ తన సోదరుడు సుశాంత్ జాదవ్‌ను తీసుకుని ఈ నెల 9వ తేదీ రాత్రి 2.30 గంటల సమయంలో కాకినాడ చేరుకున్నాడు. తాను పనిచేసిన షాపును తన వద్ద ఉంచుకున్న రెండవ తాళంతో తెరిచాడు. షాపులో బంగారు నగల తయారీకోసం ఉంచిన రెండు బంగారు ముద్దలను దొంగిలించారు. అనంతరం వారు పోర్టు రైల్వేస్టేషన్ చేరుకుని ఆవరణ సమీపంలో ఆ బంగారు ముద్దలను దాచిపెట్టి తిరిగి తమ స్వగ్రామానికి వెళిపోయారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశాంత్ జాదవ్, అతని సోదరుడు సుశాంత్ జాదవ్‌పై అనుమానం వచ్చి నూతన టెక్నాలజీతో వారిరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు చేసిన నేరాన్ని అంగీకరించడంతో వారిని స్వగ్రామం నుండి తీసుకువచ్చి వారు పోర్టు రైల్వే స్టేషన్ ఆవరణ సమీపంలో దాచిపెట్టిన బంగారు ముద్దలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు. 743 గ్రాములు విలువచేసే బంగారు ముద్దలు విలువ సుమారు రూ. 24 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్టుచేయడంలో క్రైమ్ డీఎస్పీ పల్లపురాజుతోపాటు, ఎస్సైలు వి శ్రీనివాసరావు, ఎం రవీంద్ర, సిహెచ్ సుధాకర్, హెచ్‌సి గోవిందరావు, పీసీలు చిన్న, శ్రీరామ్, అజయ్, వర్మ, బాబు, కాళి కృషిచేశారని ఎస్పీ చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో క్రైమ్ డీఎస్పీ పల్లపురాజు, ఎస్సైలు పాల్గొన్నారు.