క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు పల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, ఫిబ్రవరి 4: అతివేగంగా వెళ్తూ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టిన సంఘటన 65వ నెంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలపరిధిలోని మాణిక్యలమ్మగూడెం శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట డిపోకు చెందిన టీ ఎస్ 30 జెడ్ 0014 నెంబర్‌గల సూపర్‌లగ్జరీ బస్సు విజయవాడ నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మాణిక్యాలమ్మగూడెం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఫల్టీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా వారిలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలకేంద్రానికి చెందిన ఓర్సు ఉషారాణి, ఖమ్మంకు చెందిన వల్లపు మాధవి, హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన ఉప్పు రేవతిలకు తీవ్రగాయాలు కాగా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని నార్కెట్‌పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై బి.రంజిత్ సిబ్బందితో ఘటనస్థలానికి హుటాహుటిన తరలివెళ్లి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికుల సహయంతో బయటకు తీశారు. బస్సు డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్రగాయాలపాలైన ప్రయాణికులరాలు ఓర్సు ఉషారాణి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.