క్రైమ్/లీగల్

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, జూన్ 10: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుత్తూరులో ఆదివారం జరిగింది. ఎస్సై హనుమంతప్ప తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వెంకట్రాజు నాయుడు కుమారుడు శ్రీకాంత్ నాయుడు (23) పుత్తూరులో నివాసం ఉంటూ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి పట్టణంలోని టీబీ రోడ్డులోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో భోజనానికి వెళ్లాడు. సహచర విద్యార్థులతో కలసి చదువుకునేందుకు రాత్రి హాస్టల్‌లో బస చేశాడు. ఆదివారం ఉదయం ఉరి వేసుకుని ఉండటాన్ని సహచర విద్యార్థులు గమనించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కొండయ్య, ఎస్సై హనుమంతప్ప సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. కొన్ని సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండడంతో మనస్థాపానికి గురైన ఆయన స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసాడని ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు ఇది కూడా ఒక కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
* ఐదుగురి అరెస్ట్
శ్రీకాళహస్తి, జూన్ 10: శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లి గ్రామం వద్ద ఆదివారం ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్‌చేసినట్లు స్థానిక డీఎస్పీ వెంకటకిషోర్ వెల్లడించారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐ సుదర్శన ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేసి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 42 ఎర్రచందనం దుంగలను, టాటా మ్యాజిక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులను చూసి స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారవుతుండగా బుచ్చినాయుడుకండ్రిగ గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మయ్య, రాజేష్, గోపి, హరిబాబులను అరెస్ట్‌చేశామన్నారు. వీరిని రిమాండ్ కోసం కోర్టుకు తరలిస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో రూరల్ సీఐ సుదర్శన ప్రసాద్, శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.