క్రైమ్/లీగల్

కోట్లకు పడగెత్తిన డీఈఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ): శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. సోమవారం విశాఖలోని ఆయన ఇల్లు, శ్రీకాకుళంలోని అతని కార్యాలయంలోనూ, పాలొకొల్లు, భీమవరం ప్రాంతా ల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శ్రీనివాసరాజు ఇంట్లోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. దాడులు అనంతరం ఏసీబీ అధికారులు శ్రీనివాసరాజుపై కేసు నమోదు చేశారు. శ్రీకాకుళంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండటంతో దాన్ని సీజ్ చేశారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో విశాఖపట్నం ఇంటిలో రూ.12.27 లక్షల నగదు, 423 గ్రాముల బంగారం, గృహోపకరణాల విలువ రూ.8.9 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్సు రూ.5.45 లక్షలు లభించాయి. విశాఖలోని ఎస్‌బీఐ అక్కయ్యపాలెం బ్రాంచి లాకరుతో పాటు, ఇండియన్ బ్యాంక్‌లో కూడా మరో లాకరు ఉందని, వీటిని తరువాత తనిఖీ చేస్తారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 32 ఎకరాల వ్యవసాయ భూమి, భీమవరంలో నాలుగు ఇళ్ల స్థలాలు, విశాఖలో ఒక ఫ్లాట్‌తో పాటు ఇంటి స్థలం కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. డీఈఈ ఆస్తుల విలువ ప్రకారం రూ.1.64 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు విశాఖ, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీలు కరణం రాజేంద్ర, రామకృష్ణప్రసాద్ తెలియజేశారు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ పదికోట్లు కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

చిత్రం..మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈ శ్రీనివాసరాజు