క్రైమ్/లీగల్
ఫోర్జరీ సంతకంతో నియామక ఉత్తర్వులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఫిబ్రవరి 17: ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల కోసం పరితపిస్తున్న నిరుద్యోగులను కొందరు ఇట్టే మోసగిస్తున్నారు. అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు ఏకంగా ఫోర్జరీ సంతకాలతో నియామక ఉత్తర్వులను జారీ చేస్తుంటే ఆ పిదప వాస్తవాలు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. కడప ఆర్టీసీ రీజియన్‌లో ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం షేక్ మహ్మద్ అనే వ్యక్తికి ఓ దళారి నుంచి నియామక పత్రం అందింది. వాస్తవానికి గత నాలుగేళ్లుగా అసలు ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. పైగా నియామకం కోసం పర్సనల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫైలు కదలాలి. దానిపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతకం ఉండాలి. దీనికి సచివాలయంలో రవాణామంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి ఉండాలి. అయితే ఆర్టీసీ ఎండీ డాక్టర్ ఎం.మాలకొండయ్య దగ్గర ఓఎస్‌డీగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఫోర్జరీ సంతకంతో ఈ నియామక పత్రం జారీ అయింది. మహ్మద్‌కు ఎందుకో అనుమానం వచ్చి సచివాలయం రవాణా మంత్రిత్వ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తన మిత్రుడు షేక్ జాన్‌భాషాకు ఉత్తర్వు కాపీ పంపించి పరిశీలించమని కోరటం.. దానిపై విచారణ జరుపగా అది బోగస్ నియామక పత్రంగా గుర్తించి ఎండీ పేషీకి సమాచారం పంపించారు. దీనిపై నాగేశ్వరరావు శనివారం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.