క్రైమ్/లీగల్

ఉల్ఫా - అసోం ప్రభుత్వ మధ్యవర్తి రేబతి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ఉల్ఫా తిరుగుబాటుదారులు, అస్సాం ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించి రెండు నెలలుగా అదృశ్యమైన రేబతి హుకాన్ ఆచూకీపై రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి రెండు నెలలుగా కనపడడం లేదని రేబతి హుకాన్ కుమారుడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. తన తండ్రి 1991 నుంచి ఉల్ఫా తీవ్రవాద సంస్ధ, అస్సాం ప్రభుత్వం మధ్య చర్చల నిమిత్తం మధ్యవర్తిత్వం వహిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తన తండ్రి ఏప్రిల్ 22వ తేదీ నుంచి కనపడడం లేదన్నారు. ఉల్ఫా చీఫ్ పరేష్ బారువా తన తండ్రిని ఇంటెలిజెన్స్ బ్యూరో, రా లేదా మిలిటరీ ఇంటెలిజెన్స్, లేదా నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజన్సీ సంస్థలు అక్రమంగా నిర్బంధించి ఉంటాయని తెలిపారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ యు.యు. లాలిత్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం ఈ కేసు విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. ఈ నెల 1న ఈ అంశంపై స్పందించాలని అసోం, మేఘాలయ, కేంద్రప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.