క్రైమ్/లీగల్

ఆత్మకూరులో యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 18:ఆత్మకూరు పట్టణ శివారులో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాలు.. పాములపాడు మండల పరిధిలోని భానుముక్కల గ్రామానికి చెందిన మల్లికార్జున(30) భార్య మహాలక్ష్మితో గొడవపడి నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆత్మకూరు పట్టణంలోని ఓ లాడ్జిలో గది తీసుకున్న అతడు ఆదివారం పట్టణ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ, సీఐ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మల్లికార్జునను గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై బాదడంతో పాటు గాజుసీసాతో గొంతుకోసి హత్య చేసినట్లు గుర్తించారు. అలాగే అతడి మృతదేహం వద్య మద్యం సీసాలు, అతడు ఉన్న లాడ్జి గదికి సంబంధించిన కీ లభించినట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం పోలీసులు జాగిలాలను తెప్పించి ఆధారాల కోసం గాలించగా అవి పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు, ఆ తర్వాత కర్నూలు రోడ్డు వైపు వెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, అలాగే మల్లికార్జున భార్య మహాలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.