క్రైమ్/లీగల్

వర్షం నీరు యమపాశమై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 23: సెల్లార్‌లో పార్కు చేసిన కారులో నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం జవహర్‌నగర్‌కు చెందిన గోపినాథ్ బ్లూ ఫీల్డ్స్ సెక్యూరిటీస్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. జయానగర్‌లోని తమ సంస్థ యజమాని నవీన్ ఇంటికి వచ్చిన గోపినాథ్ రాత్రి ఆలస్యం కావడంతో ఇంటికి వెళ్ళకుండా సెల్లార్‌లో పార్కు చేసిన కారులో నిద్రిస్తానని చెప్పడంతో నవీన్ కారు తాళం చెవులు ఇచ్చి పైకెళ్లి నిద్రించాడు. అయితే గత రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరడంతో పూర్తిగా నీటితో నిండిపోయింది. అదే సమయంలో సెల్లార్ లో గల వాచ్‌మెన్ గదిలో నిద్రిస్తున్న తన కుటుంబంతో సహ పై అంతస్తుకు వెళ్ళి నిద్రించారు. తిరిగి వచ్చి చూసేసరికి సెల్లార్ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి వుంది. వాహనాలు అన్ని నీటిలో ఉండడంతో వర్షపు నీరు పైకి వస్తున్నాయని భయాందోళనకు గురైన అపార్టుమెంట్ వాసులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సెల్లార్‌లోని వర్షపు నీటిని తొలగించి కారుతో నిద్రిస్తున్న గొపినాథ్ విషయం గుర్తుకు వచ్చిన నవీన్ కారు తలుపు తెరిచి చూసే సరికి గోపినాథ్ మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.