క్రైమ్/లీగల్

కన్న కొడుకును హతమార్చిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓదెల, జూలై 1: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో శనివారం రాత్రి నరెడ్ల విజయ్ కుమార్ (23) హత్యకు గురైనాడు. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి రాధమ్మ ఫిర్యాదు ఇచ్చిన సమాచారం మేరకు తండ్రి నరెడ్ల ఆదిరెడ్డి మృతుడు విజయ్ కుమార్ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. శనివారం గ్రామంలోనే విద్యుత్ స్థంబాల తీగలను సరఫరా చేసిన అనంతరం ఇంటి వద్దనే రాత్రి ఆరుబయట రేకుల కింద తండ్రి కొడుకు నిద్రిస్తుండగా తలపై పారతో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్‌ఐ ఓంకార్ యాదవ్, పెద్దపల్లి ఎసిపి హబీబ్‌ఖాన్ సందర్శించి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. తండ్రి ఫరారీలో ఉన్నట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య రాధమ్మ, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో ఉప్పరపల్లిలో విషాదం నెలకొంది.

చిత్రం..హత్యకు గురైన విజయ్ కుమార్