క్రైమ్/లీగల్

చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూలై 2: రాష్ట్రంలో పలు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను ఖమ్మం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకొని 12లక్షల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌కమిషరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. సీసీఎస్ పోలీసులు, ఖమ్మం టూటౌన్ పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో, శ్రీశ్రీ సర్కిల్ పరిధిలో రెండు బృందాలుగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఒకరు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మరొకరు అనుమానస్పదంగా తారసపడగా వారిని అదుపులోకి విచారించారు. ఎన్టీఆర్ సర్కిల్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించగా హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన మణిగండ్ల విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఈ వ్యక్తి ప్రస్తుతం కొత్తగూడెంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 34 చోరీ కేసులలో నిందితుడు, 19 రాత్రి దొంగతనాలు, 13 పగటిపూట దొంగతనాలు, 12 సాధారణ దొంగతనాలలో శిక్షను అనుభవించాడు. ఇతని వద్దనుండి 12లక్షల విలువగల 26తులాల బంగారం, 16తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన 14తులాల బంగారు ఆభరణాలు ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టాడని వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. శ్రీశ్రీ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించగా దుగ్గిరాల సూర్యనారాయణగా గుర్తించారు. ఖమ్మంకు చెందిన సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 21వ తేది అర్థరాత్రి సమయంలో ఆటో రైల్వేస్టేషన్ సమీపంలో నిలిపి చార్మీనార్ ఎక్స్‌ప్రెస్‌లో దిగిన వెంకటేశ్వర్లు అనే ప్రయాణికున్ని ఎక్కించుకొని మమత ఆసుపత్రి వైపు తీసుకెళ్ళాడు. అక్కడ జనసంచారంలేదని గమనించి బాధితుడు వెంకటేశ్వర్లు మెడలోని బంగారం గొలుసును అపహరించి పారిపోయినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించి ఇరువురు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషనల్ డిసిపి కొల్లు సురేష్‌కుమార్, ఎసిపిలు గంటా వెంకట్రావు, ఈశ్వరయ్య, సిఐలు బి రమేష్, రాజిరెడ్డి, వెంకన్నబాబు, నాగేంద్రాచారి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.