క్రైమ్/లీగల్

మహమ్మదాబాద్‌లో వ్యక్తి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమడగూరు, జూలై 2: మండలంలోని మహమ్మదాబాద్ వద్ద బావిచెరువుపల్లికి చెందిన నరసింహారెడ్డి (42) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహమ్మదాబాద్‌లోని మద్యం షాపు వెనుక కంపచెట్లలో హత్యచేసి పడేసినట్లు స్థానికులు సోమవారం గుర్తించి, ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఎవరు హత్య చేశారు, హత్యకు గల కారణాలు ఏమిటని తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది. మిగిలిన విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి వుంది.