క్రైమ్/లీగల్

పుత్తూరులో చీటీల పేరుతో రూ. 2 కోట్ల మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 2: స్థానిక గేటుపుత్తూరులో ఉన్న కామరాజ్ నగర్‌లో నివాసం ఉంటున్న బాబు, పుష్ప దంపతులు స్థానికుల నుంచి చీటీల పేరుతో దాదాపు రూ.2కోట్లు వసూలు చేసుకుని పరారైన సంఘటన సోమవారం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హనుమంతప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కథనం మేరకు బాబు, పుష్పలు గత 30 సంవత్సరాలుగా చీటీలు వేస్తూ, స్థానికుల నుంచి అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. కొంత కాలంగా చీటీలు చెల్లించాల్సిన వారికి చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి భార్యభర్తలు, వారి కొడుకు బాల, కోడలు శ్రీదేవి, కూతురు విజయలక్ష్మి, అల్లుడు శివ కనిపించకుండా పోయారు. వీరు కనపడని విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.