క్రైమ్/లీగల్

రైస్ మిల్లు యజమానిపై పీడీ కేసు నమోథు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఉత్తర తెలంగాణలో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ పిడి చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇలాంటి మరికొందరిని ఇప్పటికే గుర్తించిన ఆ శాఖ త్వరలో వారిపైనా పిడి చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ సోమవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి రోడ్డులోని హనుమాన్ సాయి ట్రేడర్స్ యజమాని కొండా లక్ష్మణ్ (45)పై పిడి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా గత 15 ఏళ్లగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడు. ప్రభుత్వ ధాన్యాన్ని సొంత అవసరాలకు వాడుకోవడం, సిఎంఆర్ ముసుగులో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడంలో లక్ష్మణ్‌ది కీలకపాత్ర. ఇతనిపై ఇప్పటికే 8 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. గత కొంతకాలంగా లక్ష్మణ్ కదలికలపై నిఘా ఉంచిన పౌరసరఫరాల శాఖ నిఘా బృందం అతనిపై బియ్యం అక్రమ రవాణా కేసుల జాబితాను జగిత్యాల కలెక్టర్ ఎ.శరత్‌కు సమర్పించగా, అతనిపై పిడి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సివి ఆనంద్ తెలిపారు. హనుమాన్‌సాయి రైస్ మిల్లుతో పాటు రాయకల్లు, కోరుట్ల, లాటిపెల్లిలో రైస్ మిల్లులను లక్ష్మణ్ బినామీ పేర్లతో నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తున్నాడు. బినామీ పేర్లతో పౌరసరఫరాల శాఖ దగ్గర కస్టం మిల్లింగ్ కింద ధాన్యాన్ని తీసుకుని, ఆ ధాన్యాన్ని సొంత అవసరాలకు వినియోగించుకుని, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం స్ధానంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అప్పగిస్తున్నాడు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, జగిత్యాల జిల్లాల నుంచి రూ.8 నుంచి రూ.12 వరకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అదే బియ్యాన్ని ప్రభుత్వానికి రూ.25 చొప్పున అప్పగిస్తున్నాడు. దాదాపు నెలకు ఆరు నుంచి ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నాడు. ఇలా అక్రమ వ్యాపారం చేయడం ద్వారా రూ.50 నుంచి 70 లక్షల వరకు అక్రమార్జన చేస్తున్నట్లు గుర్తించారు. ఈ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సిఎంఆర్ ముసుగులో ప్రభుత్వానికి అప్పగిస్తున్నాడు. మిగిలిన బియ్యాన్ని మహారాష్ట్ర, కర్నాటక, చత్తీష్‌ఘడ్ రాష్ట్రాలకు తరలిస్తున్నాడు. అధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తూ చట్టానికి దొరకకుండా చీకటి దందా కొనసాగిస్తున్నాడని కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. జిల్లాల వారీగా ఇలా అక్రమాలకు పాల్పడే వారి జాబితా తయారు చేస్తున్నామని, త్వరలో వీరిపైనా పిడి చట్టం ప్రయోగించి కేసులు నమోదు చేస్తామని వివరించారు.