క్రైమ్/లీగల్

పుత్తూరులో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, జూలై 2: అప్పుల బాధ భరించలేక భార్యభర్తలు విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్న హేమంత్‌కుమార్ (17) రైల్వే ట్రాక్‌పై మృతి చెంది పడి ఉండగా గుర్తించారు. పుత్తూరులో సంచలనం రేపిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కామరాజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న భువన (37), మాణిక్యం (42) వారి ఇద్దరి పిల్లలతో నివసిస్తున్నారు. భువన గతంలో ఫ్యాన్సీ దుకాణం నడిపేది. భర్త మాణిక్యం ప్రైవేట్‌గా చిన్నపాటి ఉద్యోగం చేసి జీవిస్తున్నారు. వీరికి ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం సమీప బంధువుల వివాహానికి పిల్లలు ఇద్దరు వెళ్లడంతో సోమవారం ఇంట్లో విషం తాగి భార్యాభర్తలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివాహానికి వెళ్లి తిరిగి వచ్చిన వారి పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్న తల్లిదండ్రులను గుర్తించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే భువన మృతి చెందింది. మాణిక్యం పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హనుమంతప్ప చెప్పారు.
నిండ మండలం పరిధిలోని పీఎస్ కండ్రిగ పంచాయతీకి చెందిన సుధాకర్, మంజుల కుమారుడు హేమంత్‌కుమార్ (17) పుత్తూరులోని తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలకు వెళ్లిన హేమంత్‌కుమార్ కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం స్థానిక శ్మశాన వాటిక ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రేణిగుంట రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే హేమంత్‌కుమార్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.