క్రైమ్/లీగల్

తనయుడి చేతిలో తండ్రి హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, జూలై 2: తనయుడి చేతిలో తండ్రి హతమైన సంఘటన నియోజకవర్గ కేంద్రంలో కలకలం రేపింది. ఆదివారం రాత్రి కన్నకొడకు తండ్రిని హత్య చేయడం పలువురిని కంటతడి పెట్టించింది. ముధోల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అనె్నమోళ్ల పోతన్న(75) అనే వ్యక్తిని కొడుకు హత్య చేసినట్లు పేర్కొన్నారు. మద్యానికి బానిసైన చిన్న కుమారుడు నాగేష్ పనిచేయకుండా గ్రామంలో తిరుగుతాడని పేర్కొన్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తండ్రిని ఓత్తిడి చేయడంతో పాటు కర్రతో బలంగా కొట్టడంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని హుటా హుటిన అంబులెన్స్‌లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, భైంసా డీఎస్పీ అందేరాములు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భైంసాఏరియా ఆస్పత్రిలో మృత దేహన్ని సహితం పరిశీలించారు. నిందితుడుపై హత్య నేరము కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా అడిషన్ ఎస్పీతో పాటు ముధోల్ ఎస్సై భరత్ సుమన్ ఉన్నారు.