క్రైమ్/లీగల్

తహశీల్దార్ ఆఫీస్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, జూలై 2: గతం లో భూమిని విక్రయించిన వారికే అధికారులు పట్టాచేయడంతో బాధితరైతు తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. బాధిత రైతులు బడికె కర్ణాకర్, శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మాణిక్యపురం (కళ్ళెం) సర్వే నంబర్ 89లో మా తండ్రి బడికె సత్తయ్య, చిన్న నాన్న బడికె బుచ్చి ఎల్లయ్యలకు 8 ఎకరాలల 14 గుంటల భూమి ఉండగా, ఇద్దరు ఆ భూమిని పంపిణీ చేసుకోగా ఒకొక్కరికి 4 ఎకరాల 7 గుంటల భూమి వచ్చింది. బడికె బుచ్చి ఎల్లయ్యకు వచ్చిన వాటాను మా తల్లి పుషమ్మ (సత్తయ్య భార్య) 1982లో కొనుగోలు చేసింది. అదేవిధంగా సర్వే నంబర్ 90లో ఉన్న 2 ఎకరాల 2 గుంటల భూమిని 1994 లో కొనుగోలు చేసింది. ఆ సర్వే నంబర్‌లో బడికె బుచ్చి ఎల్లయ్యకు ఏ మాత్రం భూమి లేదు. కాగా మా తల్లి పుషమ్మ 2006లో అనారోగ్యంతో మృతి చెందింది. మా తండ్రి బడికె సత్తయ్యపై గత ‘మే’ నెల 18న భూమి విషయంలోనే ఎల్లయ్య కుటుంబ సభ్యులు దాడి చేసి హత్యచేశారని తెలిపారు. సత్తయ్య-పుషమ్మ వారసులమైన మేము వారి పేరున ఉన్న భూమిని విరాసత్ కింద పట్టాచేసుకోవడానికి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామన్నారు. మా భూమి మాకు పట్టాచేయకుండా సంబందిత వీఆర్‌వో సంపత్, గతంలో పనిచేసిన తహశీల్దార్ డా.నారాయణలు ఇద్దరు మాకు గతంలో భూమి విక్రయించిన వ్యక్తి బడికె బుచ్చి ఎల్లయ్య పేరుపై రికార్డుల్లో చేర్చారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మేము జనగామ జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్‌సెల్‌లో ఫిర్యాదు చేశామని అన్నారు. భూమి వివరాల వాస్తవ పరిస్థితిని పరిశీలించకుండా ఆ ఇద్దరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారనే బాధతోనే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యానని కర్ణాకర్ తెలిపాడు. మా తల్లి పుషమ్మ మరణించింది 2006 అయితే 2008లో భూమి తీర్మానం రాసినట్లు నకిలీ పేపర్లు సృష్టించి భూమిని కాజేశారని బాధితులు బోరుమని విలపించారు. ఈ విషయంపై తహశీల్దార్ వెంకటేశ్వర్లు డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మినారాయణను వివరణ అడగగా దీనిపై మాకు ఎలాంటి సమాచారం తెలియదని, గతంలో పనిచేసిన తహశీల్దార్ డా. నారాయణ, వీఆర్‌వో సంపత్‌లు ఇద్దరు చేసిన పని అని తెలిపారు. ఈ సంఘటన జరిగిన అనంతరమే వీఆర్‌వో సంపత్‌ను పూర్తి వివరాలు తెలుసుకొన్నానని, సంబందిత నివేదిక నాకు అందచేయాలని ఆదేశించానని తెలిపారు. ఏదేమైనా బాధిత రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు.