క్రైమ్/లీగల్

ఏసీబీ అధికారులమని రూ.4 లక్షలు డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల మంటూ ఆర్టీఏ సెంట్రల్ జోన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రేణుకను బెదిరించి రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మహిళ సహా ఆరుగురిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అలీమ్ సబెర్, సయ్యద్ ఉస్మాన్ అలీ, లుబ్నా ఫాతిమా, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ జాకి, ఆత్మకూర్ విజయ్, సయ్యద్ సమీర్ మెహిదీను అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. మారుతి వ్యాన్, రెండు నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, నేషనల్ యాంటీ క్రైమ్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐడి కార్డు, నకిలీ సర్ట్ఫికెట్లు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుల్లో మహిళతో పాటు మరో ముగ్గురు గత నెల 30న జూనియర్ అసిస్టెంట్ రేణుక వద్దకు కార్యాలయానికి వచ్చారు. రేణుకను కలిసి తమ వద్ద వీడియో ఒకటి ఉంది, దానిని సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో పెడతానని హెచ్చరించారు.
రూ.4లక్షలు చెల్లిస్తే సరే లేదంటే వీడియో బయటపెడతామని భయపెట్టారు. కనీసం ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఆర్టీఏ కార్యాలయం బయటకు తీసువచ్చి మాట్లాడారు. అనంతరం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌కి తీసుకెళ్లి నాన్ జూడీషియల్ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. దీంతో బాధితురాలు రేణుక పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాస్తవానికి రేణుక లంచం తీసుకుంటున్నట్లు గానీ, మరే ఇతర వీడియో గానీ నిందితుల వద్ద లేదు. ఉందని భయపెట్టారని పోలీసులు తెలిపారు. దీనిలో భాగంగా తమకు డబ్బు చాలా అర్జంటుగా కావాలని ఈ నెల 1న లక్ష రూపాయలు ముందు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రకారం ఇస్తామని చెప్పడంతో మారుతి వ్యాన్‌లో ఆర్టీఏ కార్యాలయం వద్దకు రాగానే కాపు కాచి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. కేసును ఏసీపీ ఏ.విజయకుమార్, ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్, డెటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జీ.సంతోష్‌కుమార్ దర్యాప్తు చేశారు.