క్రైమ్/లీగల్

అత్తను కొట్టి చంపిన అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూలై 3: స్థానిక కొత్త ఎడ్లలంకకు చెందిన పులిగడ్డ సూర్యకాంతం (70) అనే వృద్ధురాలిని స్వయంగా అల్లుడే హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మద్యం సేవించి ఇంటికి వచ్చిన అల్లుడు వేకనూరు పూర్ణచంద్రరావు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని, తువ్వాలుతో మెడకు ఉరివేసి కర్రతో కొట్టి వెళ్లిపోయాడు. తల్లికి భోజనం పెట్టేందుకు కుమార్తె మల్లేశ్వరి రాగా అపస్మార స్థితిలో ఉన్న తల్లిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం తరలించగా మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో సూర్యకాంతం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని సీఐ మూర్తి, ఎస్‌ఐ మణి కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.