క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 3: ఇరిగేషన్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ఆ శాఖ ఎఇ బి అనీల్ కుమార్ మంగళవారం అవినీతి నిరోధక శాఖాధికారుల దాడిలో పట్టుబడ్డాడు. బాధితుడి నుండి రూ.19వేలు లంచం తీసుకుంటుండగా విజయవాడ ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పామర్తి లక్ష్మణ కుమార్ అనే గుత్తేదారుడు రెండేళ్ల క్రితం చేపట్టిన ఇరిగేషన్ పనులకు రూ.6లక్షలు బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ బిల్లుల కోసం యేడాదిన్నరగా లక్ష్మణరావు ఇరిగేషన్ ఎఇ అనీల్‌కుమార్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎఇని కలిసిన ప్రతిసారి ఎంతో కొంత చదివించుకుంటూ వచ్చినా బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు వంటి ప్రజా ప్రతినిధులతో ఫోన్ చేయించినా ఫలితం లేకపోయిందని బాధితుడు లక్ష్మణరావు పేర్కొనడం విశేషం. చిట్ట చివరకు ఏం చేయాలో తెలియక ఎసీబీ అధికారులను ఆశ్రయించగా వారు చెప్పిన విధంగా ఎఇ డిమాండ్ చేసిన రూ.19వేలును మాచవరంలో నివశిస్తున్న ఎఇ ఇంటికి వెళ్లి ఇచ్చినట్లు తెలిపారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తన సిబ్బందితో దాడి చేసి ఎఇని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఎఇని విజయవాడలోని ఎసీబీ కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.