క్రైమ్/లీగల్

ఆధార్‌తో ఓటింగ్‌పై మార్చిలో సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎన్నికల్లో నకిలీ, బోగస్ ఓట్లను నిరోధించేందుకు ఆధార్ బేస్డ్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను నాలుగు వారాల తరువాత విచారిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్వికర్‌తో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషన్‌ను మార్చిలో పూర్తిస్థాయి విచారిస్తామని బెంచ్ ప్రకటించింది. ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఎన్నికల చట్టం సమర్థవంతంగా అమలుచేయడానికి ఆధార్ బేస్డ్ విధానం అమలుచేయాలని పిటిషనర్ కోరారు. నకిలీ, బోగస్, డబుల్ ఓటింగ్ పద్ధతికి పూర్తిగా స్వస్తిచెప్పాలంటే దీన్ని కచ్చితంగా అమలుచేయాలని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 17-18 సెక్షన్లలను స్ఫూర్తిగా తీసుకోవాలని బెంచ్‌కు సూచించారు.