క్రైమ్/లీగల్

హత్య కేసులో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూలై 3: పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామ శివారులో గత నెల 26వ తేదీన జరిగిన అమానుల్లా హత్య కేసులో నిందితులైన కొప్పుల గోవిందస్వామి, పల్లపు శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. బాల్య స్నేహితుడైన గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన కొప్పుల గోవిందస్వామి, పల్లపు శ్రీనివాస్ చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. నాలుగు సంవత్సరాల కింద ఓ బార్‌లో మద్యం సేవించే సమయంలో మృతుడు షేక్ అమానుల్లా ఖాన్‌తో బార్‌లో మద్యం సేవించే సమయంలో పరిచయం ఏర్పడింది. నిందితుల్లో ఒకరైన గోవింద స్వామికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అనంతరం అమానుల్లా ఖాన్‌కు కూడా ఆ మహిళను పరిచయం చేశాడు. పరిచయం పెంచుకున్న అమానుల్లాఖాన్ తాను కూడా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న గోవిందస్వామి ఇది మంచి పద్ధతికాదంటూ అమానుల్లాను హెచ్చరించాడు. అయితే గోవిందస్వామిని చంపేస్తానంటూ అమానుల్లా బెదిరించాడు. దీంతో అమానుల్లాను మట్టుపెట్టాలని పథకం రూపొందించుకున్న గోవిందస్వామి తన బాల్య స్నేహితుడైన శ్రీనివాస్‌తో కలిసి గత నెల 26వ తేదీన తక్కెళ్లపాడు గ్రామంలోని పొలాల వద్దకు జాతీయ రహదారి పక్కన మద్యం సేవించి మద్యం మత్తులో బీరు బాటిల్‌తో గోవింద స్వామి, శ్రీనివాస్ ఇద్దరూ అమానుల్లాఖాన్‌ను పొడిచి హతమార్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మంగళగిరి డిఎస్‌పి జి రామకృష్ణ ఆధ్వర్యంలో పెదకాకాని సిఐ శేషగిరిరావు నిందితులను అరెస్ట్‌చేశారు. ఈ కేసులో కృషిచేసిన సిబ్బందిని అర్బన్ ఎస్‌పి అభినందించారు.