క్రైమ్/లీగల్

సామూహిక అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 3: జిల్లాలో సంచలనం రేకెత్తించిన సామూహిక అత్యాచార ఘటనను అర్బన్ పోలీసులు ఛేదించారు. నర్సుపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే కటకటాల వెనక్కు పంపారు. మంగళవారం అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. గత నెల 29వ తేదీన మంగళగిరి మండలం ఆత్మకూరు పొలాల్లో నర్సుపై గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న తాడేపల్లి మండలం పోలకంపాడు గ్రామానికి చెందిన ఒక యువతికి మేడికొండూరు మండలం మందపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో మంగళగిరి నుండి పెదవడ్లమూడి వెళ్లే రోడ్డులో ఉన్న ఓ డొంకరోడ్డులోకి వెళ్లి కొంతసమయం గడిపి వెళ్లేవారు. ఈ క్రమంలో ప్రేమికుడితో కలిసి మోటారుసైకిల్‌పై రాత్రి 10 గంటల తర్వాత ఆత్మకూరు పొలాల్లోని డొంకరోడ్డులోకి వచ్చి మాట్లాడుకుంటున్న సమయంలో అదే గ్రామం గుంటూరు ఛానల్ కాల్వగట్టుపై ఉన్న యానాది కాలనీకి చెందిన రాసగిరి రాఘవయ్య, యాదగిరి అలియాస్ ఇండ్ల శ్రీనివాస్ దాడిచేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వద్దనున్న చెవిదిద్దులు తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన నార్త్ డిఎస్‌పి జి రామకృష్ణ, మంగళగిరి రూరల్ సిఐ సుబ్బారావు, టౌన్ సిఐ హరికృష్ణ, ఎస్‌ఐలు వినోద్‌కుమార్, వీరనాయక్‌లను ఎస్‌పి అభినందించారు.