క్రైమ్/లీగల్

ప్రేమోన్మాది ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, జూలై 5: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపం 17 ఏళ్ల మైనర్ బాలిక నోటిలో పురుగుమందు పోసి హతమార్చేందుకు యత్నించడమే కాక తాను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి ఆసుపత్రిపాలైన యువకుడి సంఘటన కాకుమాను మండల పరిధిలోని చినలింగాయపాలెం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కాకుమాను మండలం, చినలింగాయపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన 20 ఏళ్ల కంచర్ల భాగ్యరాజు ప్రేమించాడు. తన ప్రేమను అంగీకరించాలని నిత్యం ఒత్తిడి చేసేవాడు. బాలిక నిరాకరించడంతో ఆగ్రహించిన భాగ్యరాజు ఆ బాలికను హతమార్చేందుకు బుధవారం అర్ధరాత్రి నోటిలో పురుగుమందు పోశాడు. ఆ బాలిక స్పృహతప్పడంతో మరణించి ఉంటుందని భావించిన భాగ్యరాజు తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు, బంధువులు మైనర్ బాలికను పొన్నూరులోని ప్రైవేటు ఆసుపత్రికి, భాగ్యరాజు పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కాకుమాను పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్‌ఐ బి అంజయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.