క్రైమ్/లీగల్

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాల, జూలై 5: ఒక హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ గురజాల పదో అదనపు జిల్లా కోర్డులో జిల్లా జడ్జి ఎన్ సత్యశ్రీ గురువారం తీర్పు ఇచ్చారు. తీర్పు వెలువడిన కొద్దిసేపటికే కోర్టు ఆవరణ నుండి పోలీసుల కళ్ళుకప్పి ఒక నిందితుడు పరారయ్యాడు. దీంతో గురజాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాసిక్యూషన్ కథకం ప్రకారం దుర్గి మండలం కంచరగుంట గ్రామానికి చెందిన సాంబశివరావుకు, అదే గ్రామానికి చెందిన వీరగోవిందరావుకు మధ్య పాత కక్షలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 2012మే 18వ తేదీన రాత్రి సమయం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సాంబశివరావుపై గోవిందరావు అదే గ్రామానికి చెందిన గోపయ్య, బత్తుల పూర్ణతో కలిసి బాంబులతో దాడి చేసి, కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ మేరకు మృతుని భార్య వాణి ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పూర్తి విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికీ 14 సంవత్సరాల జైలుశిక్ష, 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పట్టణంలోని సబ్ జైలుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా నిందితుల్లో ఒకరైన బత్తుల పూర్ణ పోలీసుల కళ్ళు గప్పి మూత్ర విసర్జనకు అని చెప్పి పరారయ్యాడు. దీంతో స్థానిక డిఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి, సబ్ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. అనుమానిత ప్రాంతాలను గాలించి కొద్ది రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటామని ప్రసాద్ తెలిపారు. కోర్టు ఆవరణలో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు పరారు కావడం సంచలం కలిగించింది.