క్రైమ్/లీగల్

కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కేంద్ర ఎన్నికల సంఘంలోని చీఫ్ ఎన్నికల కమిషనర్‌తోపాటు మిగతా ఇద్దరు కమిషనర్లకూ పూర్తి అధికారాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కేంద్రం, ఈసీకి నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కేంద్రం, ఈసీకి నాలుగువారాల గడువిచ్చింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యయ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం బెంచ్ విచారించింది. ఇంతకు ముందు బెంచ్‌కు సహకరించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు కోర్టు సూచించింది. వేణుగోపాల్ సోమవారం కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. దీనిపై అనేక అభిప్రాయాలు, సూచనలు వస్తున్నాయని అన్నారు.