క్రైమ్/లీగల్

భార్య హత్యకేసులో భర్తకు యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జూలై 5: దుర్వ్యసనాలకు లోనై ఇంట్లోని నగదును తస్కరించి, ఇదేమని అడిగిన పాపానికి భార్యపై దాడిచేసి ఆమె మృతికి కారణమైన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు మూడవ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సిరిపురపు శ్రీదేవి గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన మాదాసు చిన కృష్ణారావుకు భార్య ఇంద్రాణి (65)తో సంఘటనకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయగా కుమారుడు, భార్యతో కలిసి నిడుముక్కలలో నివాసం ఉంటున్నాడు. దుర్వ్యసనాలకు బానిసై ఎటువంటి పనిచేయకుండా తిరుగుతుండేవాడు. భార్య ఇంద్రాణి, కుమారుడు సుధాకర్ కూలిపనులకు వెళ్లి పది వేల రూపాయలను ఇంట్లో దాచుకోగా వాటిని తస్కరించగా గత ఏడాది జూన్ 13వ తేదీన భార్య ఇంద్రాణి ప్రశ్నించింది. బయటకు వెళ్లిపోయిన చిన కృష్ణారావు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న ఇంద్రాణిపై గొడ్డలితో దాడిచేశాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెందింది. కుమారుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు అప్పటి మంగళగిరి సిఐ ఆర్ సురేష్‌బాబు కేసు నమోదు చేశారు. నిందితుడిపై అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంచుల వరదరాజు నేరం రుజువు చేయడంతో చిన కృష్ణారావుకు యావజ్జీగ కారాగారశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి శ్రీదేవి తీర్పు చెప్పారు.