క్రైమ్/లీగల్

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్వేలు, జూలై 5: కడప జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తిరిగి రెండో పెళ్ళికి సిద్దమవ్వడంతో ఏమీచేయలేని స్థితిలో ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా ప్రేమించి నమ్మించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం తనను కాదంటున్నాడని ఆ యువతి పోలీసు స్టేషన్‌కు ఎక్కింది. గత మూడు రోజులుగా పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నాలు జరిగిన ఫలించకపోవడంతో చివరకు భర్త ఇంటి ముందు చేరుకుని సాయి ప్రనూష ఆందోళనకు దిగింది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి సాయిప్రనూషను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సాయిప్రనూష మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా షేక్ షరీఫ్, తాను ప్రేమించుకుంటున్నామని అయితే 4 సంవత్సరాల క్రితం షరీఫ్ బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లారన్నారు. అప్పటి నుంచి ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాడని అయితే రెండు నెలల క్రితం ఏప్రిల్ 18న తనను కూడా కువైట్‌కు పిలిపించుకుని సహజీవనం సాగిస్తూ వచ్చారన్నారు. కాగా జూన్ నెల 23న కువైట్‌లో తనను వివాహం చేసుకున్నాడన్నారు. అనంతరం 25న తనను కువైట్‌లోనే వుంచి షరీఫ్ ఇండియాకు తిరిగి వచ్చాడని అప్పటి నుంచి తనకు ఫోనులో సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానంతో తాను కూడా ఇండియాకు వచ్చానన్నారు. అనంతరం పట్టణంలోని వెంగమాంబనగర్‌లో షరీఫ్ ఇంటికి వెళ్లి ఆరాతీయగా తనకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతూ వచ్చాడని తెలిపారు. ఈ నేపథ్యంలో షరీఫ్ రెండో పెళ్లికి సిద్దమవ్వడంతో పాటు నిశ్చితార్థం చేసుకుంటున్నాడన్న విషయం తెలిసి పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించానని తెలిపారు. అయితే 8 సంవత్సరాలుగా ప్రేమించడంతో పాటు కొంత కాలంగా సహజీవనం సాగిస్తూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పడు తనను వద్దని చెప్పడం చాలా భాదగా వుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనకు కావాలంటూ పెద్ద మనుషులతో చెబుతూ వచ్చానని అయినప్పటికీ తాను రెండో పెళ్లికి సిద్దమవుతూ తనను వద్దు అనడంతో షరీఫ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారన్నారు. ఆ మేరకు షరీఫ్ తల్లితో ఎంత వాగ్వాదం చేసినప్పటికి రెండో పెళ్లి చేస్తున్నామని ఆమె చెప్పడంతో ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని తన భర్తతో నన్ను కలపాలని కోరారు. అయితే షరీఫ్ మాత్రం సాయిప్రనూషను తిరస్కరించడంతో చివరకు బద్వేలు సీఐ రెడ్డప్ప సాయిప్రనూష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.