క్రైమ్/లీగల్

నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిహత్నూర్, జూలై 5: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన నాలుగేళ్ళ చిన్నారిపై 14ఏళ్ళ మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన సంఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారి బుధవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన మైనర్ బాలుడు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకవెళ్ళి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దాంతో భయాందోళనకు గురైన ఆ బాలిక ఏడుస్తుండగా స్థానికులతో పాటు బాలిక తండ్రి రావడంతో బాలుడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై బాలిక కుటుంబ సభ్యులు గురువారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు బాలుడిపై నిర్భయ, ఫ్రోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, ఆ బాలున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై బాలసామి రామాగౌడ్‌లు తెలిపారు.