క్రైమ్/లీగల్

30లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జూలై 5: పట్టణంలోని డాల్డ కంపెనీ కాలనీలో గల జన్నింగ్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీఎత్తున నిల్వ ఉంచిన నిషేదిత గుట్కాను గురువారం పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గల జన్నింగ్ ఫ్యాక్టరీలో డిఎస్పీ నర్సింహారెడ్డి, సిఐ స్వామి, వి.సురేష్ అధ్వర్యంలో సోదాలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.30లక్షల విలువ గల గుట్కాప్యాకెట్లు బయటపడ్డాయి. నిషేధిత గుట్కా మార్కెట్‌విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా ప్రధాన నింధితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం.