క్రైమ్/లీగల్

238 సబ్సీడీ గొర్రెల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, జూలై 5: మండలంలోని ఎస్.లింగోటం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఎస్సై నర్సింహులుగౌడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రామ శివారులో రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 238 సబ్సీడీ గొర్రెలను పట్టుకున్నారు. లారీ డ్రైవర్లు పోలీసుల ప్రశ్నలకు సరియైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎస్సై వారిని పట్టుకొని సబ్సీడీ గొర్రెల అక్రమ రవాణా వివరాలను రాబట్టారు. ఎస్.లింగోటం నుండి గొర్రెలను గుంటూరు జిల్లా మాచర్లకు తరలిస్తున్నామని వారు తెలిపారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పశువైద్యాధికారి వెంకన్నలు ఘటనా స్థలికి చేరుకొని సబ్సీడీ గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లచ్చుగూడెం గ్రామానికి చెందిన 11 మంది లబ్దిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. దళారులు మార్గమధ్య నుండే కొనుగోలు చేసుకుంటున్నారు. అధికారులు మాట్లాడుతూ సబ్సీడీ గొర్రెలు విక్రయించిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఎస్.లింగోటం గ్రామంలో నలభై మంది లబ్దిదారులకు 11 మంది లబ్దిదారులు దళారులకు అమ్ముకున్నారని, వారిపై కలెక్టర్ ఆదేశానుసారం డాక్టర్ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై నర్సింహులుగౌడ్ తెలిపారు.