క్రైమ్/లీగల్

రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూలై 5: నల్లబజారుకి తరలించడానికి సిద్ధంగా ఉన్న 2వేల కిలోల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని ఆంజనేయవాగు సెంటర్‌లో రెండు వాహనాల్లో 40 బస్తాల రేషన్ బియ్యం తరలించడానికి సిద్ధం చేశారని విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకి సమాచారం అందింది. దాంతో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ పోలాకి వెంకటేశ్వర్లు రెండు వాహనాలను అటకాయించారు. వాటిల్లోని బియ్యం బస్తాలు లెక్కించగా 40 ఉన్నట్లు తేలింది. 60 వేల రూపాయల విలువైన 20 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీలర్ మట్టెల శ్రీనివాసరావు షాపు నుండి గుంటూరు జిల్లా మంగళగిరికి తరలించడానికి ఆ వాహనాల్లో లోడు చేశాడని నిర్థారించారు. రెండు వాహనాలకు సీల్ చేశారు. అలాగే రేషన్ షాపుని సీజ్ చేశారు. నిందితునిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కొత్తపేట పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో సీఐ, విజిలెన్స్ సిబ్బంది, సివిల్ సప్లయిస్ ఆర్‌ఐ నాగుల్ మీరా, వీఆర్వో ఆర్ శ్రీనివాస్, డీ సుధీర్ పాల్గొన్నారు. వాహనాలతో పాటు వాటి యజమానులనూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ వెంకటేశ్వర్లు వివరించారు.