క్రైమ్/లీగల్

చిన్నారులే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 5: చిన్నపిల్లలను టార్గెట్ చేసుకున్న దొంగలు ఎత్తుకెళ్లి ఒంటి పై ఉన్న ఆభరణాలను దొంగిలించుకుని పరారవుతున్నారు. ఇలాంటి ఘటనలు సూరారంలో కలకలం రేకితిస్తున్నాయ. వివరాల్లోకి వెళ్తే.. సూరారం కాలనీలో నివాసముండే యాదగిరి, సరిత దంపతులకు ప్రణతి (6) కుమార్తె. ఓ గుర్తుతెలియని మహిళ వచ్చి ఓ ఇంట్లో పని చేస్తున్నామని నమ్మించింది. సరిత కుమార్తె ప్రణతికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో చుట్టుప్రక్కల వెతికారు. దగ్గరలోని 60 గజాల ఇళ్ల దగ్గర ఏడుస్తున్న ప్రణతిని సరిత దంపతులు గుర్తించారు. పాప చెవులకు ఉన్న బంగారు రింగులు, వెండి పట్టీలను అపహరించి పరారైంది. అదే కాలనీలో నివాసముండే అమరేందర్ రెడ్డి కూతురు ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తుతెలియని మహిళ వచ్చి బంగారు, వెండి ఆభరణాలను లాక్కొని పాపను వదిలేసి పరారైంది. అదే బస్తీలో నివాసముండే మమత, ముత్యాలు దంపతుల కుమార్తె హనీ(5)ని గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లి చెవికి, కాళ్లకు ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించి సాయిబాబా కాలనీలో చర్చి వీధిలో వదిలేసి పరారైంది. ఉదయం 9.30 గంటలకు అపహరణకు గురైన హనీ మధ్యాహ్నం 1.30 గంటలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. సూరారం కాలనీలో ఇలా వరుసగా చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుని ఓ మహిళ పరారవుతుంది. సీసీ కెమెరాలకు చిక్కకుండా చాకచక్యంగా చోరీలు, పిల్లల అహరణకు పాల్పడుతుండడం గమనార్హం.