క్రైమ్/లీగల్

స్కూల్ వ్యాన్ టైరు కింద పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడివేముల, జూలై 6:స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిలకలగూడూరు గ్రామానికి చెందిన చిన్న చిట్టెపు చెన్నపురెడ్డి కుమార్తె హన్సిక(20నెలలు) శుక్రవారం ఉదయం స్కూల్ వ్యాన్ టైరు కింద పడి మృతిచెందింది. ఉదయం గడివేముల గ్రామంలోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన వ్యాన్ బిలకలగూడూరు గ్రామానికి చెందిన విద్యార్థులను ఎక్కించుకుని తిరుగు ప్రయాణంలో హన్సికను ఢీకొంది. డ్రైవర్, క్లీనర్ గుర్తించక అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
క్రిష్ణగిరి, జూలై 6:పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండల పరిధిలోని పోతుగల్లు గ్రామానికి చెందిన సంగాల రామానాయుడు(35) శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో రామానాయుడుపై అతడి మరదలు శాంతితో పాటు ఆమె తల్లి సుంకులమ్మ తాగునీటి కుళాయి దగ్గర నీరు పట్టుకునే విషయంలో ఘర్షణ పడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన రామానాయుడు గత నెల 28వ తేదీ తన పొలంలోకి వెళ్లి పంటకు పిచికారి చేసే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దీంతో అతడి భార్య మాదేవీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.