క్రైమ్/లీగల్

పొలం కోసం మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, జూలై 6:మండల పరిధిలోని గోనబావి గ్రామానికి చెందిన మహిళా రైతు మల్కాబీ పొలంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే పనులు చేపట్టారు. దీంతో అధికారులు తన పొలం స్వాధీనం చేసుకుంటారోనన్న భయంతో మల్కాబీ పొలంలోనే పురుగుల ముందు తాగి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీనాథ్, తాలూకా ఎస్‌ఐ సునిల్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని మల్కాబీని పరామర్శించి ఆమె భర్త నుంచి పలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె భర్త మాట్లాడుతూ 2001లో తాము రూ. 45వేలకు 56 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో కూరగాయలు సాగు చేసుకుని జీవిస్తున్నామని, అయితే గ్రామానికి చెందిన కొందరు ఈ భూమిని ఎలాగైనా లాక్కోవాలని కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తులు తమ పంట పొలాన్ని ధ్వంసం చేయడానికి జేసీబీ సైతం తీసుకొచ్చారని, అయితే రెవెన్యూ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఇదేమని ప్రశ్నిస్తే అధికారులు ఎవరూ మాట్లాడకుండా సర్వే పనులు చేస్తున్నారని, దీంతో భయపడిన తన భార్య పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాధితురాలి భర్త కాశీం తహశీల్దార్ ఎదుట వాపోయాడు. దీంతో స్పందించిన తహశీల్దార్ శ్రీనాథ్ సర్వే చేసినంత మాత్రాన మీ పొలం తీసుకోమని, సర్వే పనులు చేయడానికి చుట్టు పక్కల పొలాలు కూడా కొలతలు వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇది బంజరు భూమి అని దీని పక్కనే మరో 53 సెంట్ల భూమి ఉందని అందులో శ్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్థులు కోరడంతో సర్వే పనులు చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిని పూర్తిగా పరిశీలించి న్యాయం చేస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.