క్రైమ్/లీగల్

వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 6 : కర్నూలు వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ కళాశాలలో గురువారం అర్ధరాత్రి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షప్రణీత్‌రెడ్డి(18) ఆత్మహత్యకు పాల్పడడంతో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. కడప నగరానికి చెందిన రామాంజులురెడ్డి కుమారుడు హర్షప్రణీత్‌రెడ్డి కర్నూలు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అయితే గురువారం అర్ధరాత్రి ఉన్నఫళంగా హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో ఎప్పుడూ ముందుండే ప్రణీత్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హాస్టల్‌లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ పలుమార్లు తమ కుమారుడు తనతో వాపోయాడని తండ్రి రామాంజులురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హర్షప్రణీత్‌రెడ్డిని ర్యాగింగ్ చేసి అనంతరం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. గతంలో కూడా జూనియర్ విద్యార్థులను సీనియర్లు దుస్తులు ఊడదీసి ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటనలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఆ ఘటనలో నలుగురు విద్యార్థులను జైలుకు పంపి కళాశాల నుంచి బహిష్కరించారు. ఆ ఘటన మరువక ముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం నగరంలో కలకలం రేపింది. కర్నూలు వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉన్నప్పటికీ ఆచరణలో ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మెడికల్ హాస్టల్‌లో ర్యాగింగ్ చాపకింద నీరులా విస్తరిస్తున్నా నివారించాల్సిన అధికారులు ఫిర్యాదులు అందడం లేదని తప్పించుకోడం పలు విమర్శలకు దారితీస్తోంది. ర్యాగింగ్ ఘటనలు బయటకు పొక్కకుండా కళాశాల అధికారులు తొక్కిపెట్టడం వల్లే మరో విద్యార్థి బలయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయని, పరీక్షల ఒత్తిడి వల్లే ప్రణీత్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్ పేర్కొంటున్నారు. ప్రణీత్‌రెడ్డి మృతిపై త్రిసభ్య కమిటీ వేశామని విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రామాంజులురెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని కర్నూలు డీఎస్పీ యుగంధర్‌బాబు తెలిపారు.