క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఫిబ్రవరి 20 : పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మడకశిర రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రొద్దం మండలం మరవపల్లికి చెందిన జే.నారాయణరెడ్డి (45) మృతి చెందారు. పెనుకొండ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న స్కార్పియో ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలియగానే స్వగ్రామం మరవపల్లికి చెందిన గ్రామస్థులతోపాటు ఎమ్మెల్యే బీకే పార్థసారధి ప్రమాదంపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.