క్రైమ్/లీగల్

జిల్లాలో ఆరుగురు రౌడీ షీటర్లపై పీడీ యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 6: జిల్లాలోని మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఆరుగురు రౌడీ షీటర్లపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పలు హత్యలు, హత్యాయత్నాలు , చోరీలు, దందాలు, భూకజ్జాలు, ఆయుధాలు కల్గి ఉండటం , అక్రమవ్యాపారాలకు పాల్పడుతూ నేర ప్రవృత్తికి అలవాటు పడి సమాజానికి హానికంరగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నందును వీరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపడంతో కలెక్టర్ అనుమతితో వీరిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు వివరించారు. ఇందులో ఒక మహళ కూడా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో తొలిసారిగా మహిళపై పీడీ యాక్టు నమోదు కావడం ఇదే ప్రధమం కావడం విశేషం . కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన శెట్టి సుజాత (49) సారా వ్యాపారం చేయడంతో పలువురు రౌడీలతో సంబంధాలు పెట్టుకొని వ్యభిచార గృహం నడపంతో పాటు, చోరీలు, భూకజ్జాలు, పాల్పడమే కాకుండా తన గ్యాంగ్‌తో రెండు హత్యలు పలు హత్యాయత్నాలకు ప్పాలడంతో ఈమెపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మదనపల్లి మండలం కోట గుండ్లపల్లికి చెందిన నారే గంగ్రాద్రి (33) చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతూ నేర వృత్తికి అలవాటు పడ్డాడని, ఇతనిపై ఇప్పటికే నాలుగు హత్యకేసులు, ఒక హత్యాయత్నం కేసునమోదు అయినందున ఇతనిపై కూడా పీడీ యాక్టు నమోదు చేశామని తెలిపారు. కురబలకోట మండలం రఘునాధ పురం గొల్లపల్లికి చెందని బిజిలి మధుకర్ (26) సమాజంలో శాంతికి భంగం కల్గించే చర్యలకు పాల్పడుతూ హత్యలు హత్యాయత్నాలకు పాల్పడి నేపధ్యంలో ఇతనిపై పీడీ యాక్టు నమోదు చేసామని తెలిపారు. మదనపల్లి మండలం బొమ్మన చెరువు గ్రామానికి చెందిన రాగినేని రఘుపతి (40) నేత పని చేసుకొంటూ జీవనం సాగిస్తూ క్రమేణా నేర వృత్తిలోకి దిగి మూడు హత్యలు ఒక హత్యాయత్నం కేసులోనిందితుడిగా ఉన్నందున ముందస్తు చర్యగా పీడీ యాక్టు నమోదు చేశామని వివరించారు. మదనలపల్లి మండలం మలేపాడు పంచాయతీ దేవళంపల్లికి చెందిన మొలక రామమోహన్ (34) బి కొత్తకోట మండలం గొల్ల పల్లి పంచాయతీ గుడిసి వారిపల్లికి చెందిన దేవీవరప్రసాద్ (23) పలు హత్యలు వివిధ నేరాల కింద వీరిపై కేసులు ఉన్నందున వీరిపై కూడా పీడీ యాక్టు నమెదు చేసామని, వీరిని ప్రస్తుతం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కడప సెంట్రల్ జైలుకు పంపామని తెలిపారు. ఈ ఆరుగురు కరుడుకట్టిన నేర ప్రవర్తన కలిగి, చట్టాన్ని, వ్యవస్థలను లెక్క చేయక తమ ఇష్టాను సారంగా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఎన్ని కేసులు నమోదు చేసినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్టు చట్టాన్ని ప్రయోగించామని తెలిపారు. జిల్లాలో ఎవ్వరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.