క్రైమ్/లీగల్

తమ్ముడిని చంపిన అన్న..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఫిబ్రవరి 20 : నాలుగు అడుగుల స్థలం తనకు ఇవ్వలేదని అన్న తమ్ముడిని వేటకొడవలితో నరికి చంపిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అమిదాలగొంది పంచాయతీ టీడీపల్లికి చెందిన రంగధామప్పకు ప్రభుత్వం మరుగుదొడ్డి మంజూరు చేసింది. అయితే మరుగుదొడ్డి నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో తమ్ముడు రంగస్వామి (48) స్థలంలో మరుగుదొడ్డి నిర్మించాలని భావించాడు. ఇందుకు తమ్ముడు నిరాకరించాడు. ఈనేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రంగస్వామి, అతని భార్య రత్నమ్మ పనిచేసుకుంటుండగా వెనుక వైపు నుండి వేటకొడవలితో నరకడంతో తీవ్రగాయాలకు గురయ్యాడు. భార్య అడ్డుతగలడంతో ఆమెపైనా దాడి చేయడంతో ఎడమ చేయికి దెబ్బ తగిలింది. గమణించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయపడ్డ ఇద్దరినీ మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రంగస్వామి మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై లింగన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు.