క్రైమ్/లీగల్

బెట్టింగ్‌కు పాల్పడిన ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూలై 6: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.2లక్షల 9వేలు నగదు, బెట్టింగ్‌కు ఉపయోగించిన ల్యాప్ ట్యాప్‌లు, టీవీలు, క్రిడిట్ కార్డ్సు, డెబిట్ కార్డ్సు, సెల్‌ఫోన్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం కృషాణ జిల్లా కంకిపాడు మండలం ఏడుపుగళ్లు గ్రామానికి చెందిన బబ్బ వెంకట్ ఠత్నం (35), ప్రకాశం జిల్లా, సింగరాయ కొండ, బంగిన పల్లి గ్రామానికి చెందిన మాటూరి హరిప్రసాద్ రెడ్డి (43), కృషాణ జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన బబ్బ సీతఠామయ్య (38), భీమవరం ప్రాంతానికి చెందిన వడుగు వీర అజయ్ కుమార్ (27), కృషాణ జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన ఠొయ్యూరు నాగరాజు (27) కలసి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో నివాసం ఉంటూ ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్సు, డెబిట్ కార్డ్సు ద్వార క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈనెల 5, 6 తేదీలలో జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే టీ-20 మ్యాచ్‌లకు లక్షలలో బెట్టింగ్‌లు పెట్టారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్ గూడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బెట్టింగ్‌లు పెడుతున్నట్లు ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం వచ్చింది. గురువారం సాయంత్రం మిర్ పేట్, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బెట్టింగ్‌కు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.