క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: నగరంలోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో కానిస్టేబుల్ తన ఏకే 47 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడా లేదంటే ప్రమాదవశాత్తు పేలిందా అని జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్రాంత డిజి ఆర్పీ మీనా ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిషోర్ బాబు శుక్రవారం సాయంత్రం తన ఏకే 47తో కాల్చుకోవడంతో బుల్లెట్లు చాతీ పక్కనుంచి దూసుకుపోయాయి. ఆత్మహత్యా యత్నం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు చికిత్స చేసిన అనంతరం ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పడంతో కానిస్టేబుల్ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబంలో ఉన్న తగాదాలు, ఆర్ధిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంఘటన ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను ఉంచాడు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సహచర సిబ్బంది కిషోర్ తుపాకీ ప్రమాద వశాత్తు పేలడంతో సంఘటన జరిగిందని చెబుతున్నారు. దీనిలో ఏది నిజమనే అంశంపై విచారణ చేపట్టారు. బాధితుడికి కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: మేడ్చల్ పోలీసు స్టేష్టన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యప్రకాశ్(32) గురువారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. శామీర్‌పేట్‌లోని ఓ అద్దె ఇంటిలో నివాసం ఉండే సూర్యప్రకాశ్ అనే పోలీసు కానిస్టేబుల్ శామీర్‌పేట్ ఠాణా నుండి మేడ్చల్ పీఎస్‌కు ఇటీవల బదిలీపై వచ్చాడు. శుక్రవారం శామీర్‌పేట్‌లోని ఇంటిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆఘామేఘాలమీద సూర్యప్రకాశ్‌ను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం సూర్యప్రకాశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. మూడు రోజులుగా సూర్యప్రకాశ్ విధులకు కూడా హాజరుకావడం లేదని తెలిసింది. మూడు రోజుల క్రితం కూడా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసు ఉన్నతాధికారులకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపించడంతో మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి పిలిపించి కౌనె్సలింగ్ నిర్వహించినట్లు తోటి సిబ్బంది వివరించారు. సూర్యప్రకాశ్ ఆత్మహత్య యత్నానికి కారణాలు తెలియరాలేదు.