క్రైమ్/లీగల్

ఏసీబీ పేరుతో డబ్బులు వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 6: అవినీతి నిరోధక శాఖ పేరుతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్న బాలాజీ జశ్వంత్ (35) రామంతాపూర్‌లో నివసిస్తూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ చార సుకునందన్ రెడ్డిని బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. తాను ఏసీబీ ఏజెంట్‌ను అంటూ ఇవ్వకపోతే అక్రమంగా సంపాదించిన ఆస్తులపై దాడి చేయిస్తానని బెదిరిస్తూ ముందుగా రూ.25 వేలు వసూలు చేసుకున్నాడు. అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు తెలిపారు.