క్రైమ్/లీగల్

రూ.కోటి విలువైన గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 6: ప్రజల ఆరోగ్యాన్ని హరించే గుట్కాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం సాగుతోంది. మహారాష్ట్ర నుంచి గుట్కా, జర్దా, మత్తు పదార్థాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రవాణా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. రెండు రోజులుగా ఆదిలాబాద్‌లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించగా స్థానిక డాల్డా కంపెనీ కాలనీలోని దేశ్‌ముఖ్ జిన్నింగ్ గోడౌన్‌లో భారీఎత్తున గుట్కా మత్తు పదార్థాల నిల్వలు బయటపడ్డాయ. వీటి విలువ కోటిపైనే ఉంటుందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ శుక్రవారం తెలిపారు. ఆదిలాబాద్ అడ్డాగా కొందరు అక్రమార్కులు మహారాష్ట్ర నుండి భారీఎత్తున అడ్డదారుల్లో గుట్కా, జర్దా ఇతర నిషేధిత మత్తు పదార్థాలను ఆదిలాబాద్‌లో డంపు చేసి ఇతర జిల్లాల్లో జోరుగా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. దేశ్‌ముఖ్ జిన్నింగ్ గోడౌన్‌లో గుట్కా నిల్వలు ఉన్నట్లు సమాచారం మేరకు స్థానిక పోలీసులతో పాటు సిసిఎస్ పోలీసు బృందాలను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టగా వందలాది గన్నీ బ్యాగుల్లో అక్రమ రవాణా కోసం నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు బయటపడడం జరిగిందని, వీటి విలువ మార్కెట్‌లో కోటిపైనే ఉంటుందని ఎస్పీ తెలిపారు. జిన్నింగ్ పరిశ్రమకు చెందిన దేవదర్ దేశ్‌ముఖ్ ఖాళీగా ఉన్న గోడౌన్‌ను తొమ్మిది నెలలకు రూ.9వేల చొప్పున అద్దెకు ఇచ్చి పరోక్షంగా గుట్కా వ్యాపారానికి సహకరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్‌లోని పంజాషా కాలనీకి చెందిన వ్యాపారితో పాటు ఐదుగురు సోదరులు కలిసి గుట్కా పదార్థాలను కిళ్లీ షాపులకు, కిరాణ దుకాణాలకు రవాణా చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు సైపుల్లాఖాన్‌తోపాటు సమిరుల్లాఖాన్, ఫసి ఉల్లాఖాన్, సాజిద్ ఉల్లాఖాన్, జలీమ్ ఉల్లాఖాన్, జిన్నింగ్ యజమాని దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేశామని, వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం సిసిఎస్ పోలీసులు రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.