క్రైమ్/లీగల్

ఏసీబీ దాడుల్లో రూ.4కోట్ల ఆస్తుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, జూలై 6: ఆదాయానికి మించి ఆస్థులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు నీటిపారుదల శాఖ సీఇ సురేష్ కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించారు. జిల్లాలో వివిధ స్థాయిలో పనిచేసిన కొంకిమల్ల సురేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కృష్ణ బేసిన్‌లో సిఇగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్థులు కలిగి ఉన్నాడన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కరీంనగర్, హైదరాబాద్‌తో పాటు ఆయన సొంత ఊరైన కడప జిల్లా పొద్దుటూరులోని అతని బంధువుల ఇళ్లలో దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కరీంనగర్ టౌన్ పరిధిలో ఏసీబీ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు మూడు అపార్ట్‌మెంట్లు, రెండు ఇండ్లతో పాటు పది ఇళ్ల్ల స్థలాలు, రూ.22.94 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఇంట్లో జరిపిన సోదాలలో 63 తులాల బంగారు ఆభరణాలు గుర్తించినట్లు తెలిపారు. నాలుగు బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకున్నామని, వీటిని శనివారం తెరుస్తామని తెలిపారు. మొత్తం ఏడు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా పూర్తిస్థాయిలో విచారించిన తరువాతే కరీంనగర్ ఎసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.