క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 20: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని పగలు, రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు ఎరికల సంపతి గంగన్న అనే నిందితున్ని అరెస్టు చేసి, నిందితుని నుంచి అర కిలో బంగారం ఆభరణాలు, 15 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు డీఎస్పీ వెంకటరావుతెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వెంకటరావు తెలిపిన వివరాల మేరకు గోరంట్ల మండలం రాజీవ్ కాలనీకి చెందిన ఎరికల సంపతి గంగన్న పాత నేరస్తుడన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి తన సహచర బంధువైన ఎరికల దుర్గాప్రసాద్‌తో కలిసి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్నాటక రాష్ట్రంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేయటంలో నిష్ణాతుడు అన్నారు. 2014లో జైలు నుంచి బయటికి వచ్చిన నిందితుడు అనంతపురం, కదిరి, గోరంట్ల, రొద్దం, పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ఎరికల సంపతి గంగన్నపై జిల్లా వ్యాప్తంగా 35 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ కేసులకు సంబంధించి నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. జిల్లాలోని పలు స్టేషన్లలో వారెంట్లు సైతం పెండింగ్‌లో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. రూ. 15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. నిందితుడి అరెస్టులో కీలక పాత్ర పోషించిన సీసీఎస్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఇ. శ్రీనివాసులు, సీఐలు వన్‌టౌన్ విజయభాస్కర్ గౌడ్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.